ఏ దివి లో విరిసిన పారిజాతమో
ఏ కవి లో మెరిసిన ప్రేమ గీతమో
నా మది లో నీవై నిండి పోయెనే ....
ఏ దివి లో విరిసిన పారిజాతమో
ఏ కవి లో మెరిసిన ప్రేమ గీతమో..
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే....
పాల బుగ్గలను లేత సిగ్గు తో పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలి తో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజ హంస ల రావే.....
నిదుర మబ్బులను మెరుపు తీగ వై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణ పై పరనయ రాగములు ఆలపించినది నీవే
పదము పదము లో మధువులూరగా కావ్య సంధ్య వై రావే...
ఏ దివి లో విరిసిన పారిజాతమో
ఏ కవి లో మెరిసిన ప్రేమ గీతమో
నా మది లో నీవై నిండి పోయెనే ....
ఏ దివి లో విరిసిన పారిజాతమో
ఏ కవి లో మెరిసిన ప్రేమ గీతమో..
Monday
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment