Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Monday

ఏ దివి లో విరిసిన పారిజాతమో ...

ఏ దివి లో విరిసిన పారిజాతమో
ఏ కవి లో మెరిసిన ప్రేమ గీతమో
నా మది లో నీవై నిండి పోయెనే ....
దివి లో విరిసిన పారిజాతమో
కవి లో మెరిసిన ప్రేమ గీతమో..

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే....

పాల బుగ్గలను లేత సిగ్గు తో పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలి తో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజ హంస ల రావే.....

నిదుర మబ్బులను మెరుపు తీగ వై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణ పై పరనయ రాగములు ఆలపించినది నీవే
పదము పదము లో మధువులూరగా కావ్య సంధ్య వై రావే...

దివి లో విరిసిన పారిజాతమో
కవి లో మెరిసిన ప్రేమ గీతమో
నా మది లో నీవై నిండి పోయెనే ....
దివి లో విరిసిన పారిజాతమో
కవి లో మెరిసిన ప్రేమ గీతమో..

Tuesday

నువ్వే నా శ్వాస

నువ్వే... నా శ్వాస...
మనసున నీకై.. అభిలాష...
బ్రతుకైన నీతోనే ...
చితికైన నీతోనే...
వెతికేది నే నిన్నేనని..
చెప్పాలని...... చిన్ని ఆశ..

ఓ ప్రియతమా ఊఁ ప్రియతమా....

నువ్వే... నా శ్వాస
మనసున నీకై.. అభిలాష

ఓఓఓఓఒ....
తారననమ్ తనన తననం..
తరననం తనన తననం..
తరననం తనన తననం..
పువ్వుల్లో పరిమలాలన్ని పరిచయమే చేసావు
తరాల్లో మెరుపులన్ని దోసిలి లో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపిమ్చావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావు గా
నీ జ్ఞాపకాలన్నీ ...ఏ జన్మలోనైనా..
నే మరవలేనని.. నీ తో చెప్పాలని..చిన్ని ఆశ..

ఓ ప్రియతమా ఓ ప్రియతమా....
నువ్వే... నా శ్వాస
మనసున నీకై.. అభిలాష


సూర్యునితో పంపుతున్న.. అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్న ..ఆరాధన రాగాన్ని
ఎరులతో పంపుతున్న.. ఆరాటపు ప్రవాహాన్ని
దారుతులతో పంపెస్తున్న..అలుపెరుగని హృదయ లయలన్ని
ఏ చోట నువ్వున్న...... నీ కొరకు చూస్తున్న.....
నా ప్రేమ సందేశం విని వస్తావని....చిన్ని ఆశ..

ప్రియతమా ప్రియతమా....

Friday

దేశ భాషలందు తెలుగు లెస్స

ఈ రొజు నుండి తెలుగు లో కూడ రాయాలని అనుకుంటున్నాను ఈ పాట తో మొదలు పెడుతున్నాను... ఎవరు రచించినదొ తెలియదు కాని ఈ సందర్భానికి.. బావుందని మీ తో పంచుకుంటున్నను..

చెరకుర సంపన్న ప్రవచింపగ తేనియ జాలు కన్నా...
బాసుర సుధ కన్నా..
తియ్యనగు చూత ఫలంబుల కన్నా...
ఖండ చక్కర రుచి కన్నా...
చాల మధురంబై తోచెడి తెన్గు భాష...అవును రా..
నిజమిట్టి ధాత్రిని కనుంగొనుమయ్య అనుఁగు సొదరా....


మీకు కూడ నచ్చుతుందని, మీ అభిప్రాయము నాతో పంచుకుంటారని ఆశిస్తున్నను...

Marketplace