Tuesday

నువ్వే నా శ్వాస

నువ్వే... నా శ్వాస...
మనసున నీకై.. అభిలాష...
బ్రతుకైన నీతోనే ...
చితికైన నీతోనే...
వెతికేది నే నిన్నేనని..
చెప్పాలని...... చిన్ని ఆశ..

ఓ ప్రియతమా ఊఁ ప్రియతమా....

నువ్వే... నా శ్వాస
మనసున నీకై.. అభిలాష

ఓఓఓఓఒ....
తారననమ్ తనన తననం..
తరననం తనన తననం..
తరననం తనన తననం..
పువ్వుల్లో పరిమలాలన్ని పరిచయమే చేసావు
తరాల్లో మెరుపులన్ని దోసిలి లో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపిమ్చావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావు గా
నీ జ్ఞాపకాలన్నీ ...ఏ జన్మలోనైనా..
నే మరవలేనని.. నీ తో చెప్పాలని..చిన్ని ఆశ..

ఓ ప్రియతమా ఓ ప్రియతమా....
నువ్వే... నా శ్వాస
మనసున నీకై.. అభిలాష


సూర్యునితో పంపుతున్న.. అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్న ..ఆరాధన రాగాన్ని
ఎరులతో పంపుతున్న.. ఆరాటపు ప్రవాహాన్ని
దారుతులతో పంపెస్తున్న..అలుపెరుగని హృదయ లయలన్ని
ఏ చోట నువ్వున్న...... నీ కొరకు చూస్తున్న.....
నా ప్రేమ సందేశం విని వస్తావని....చిన్ని ఆశ..

ప్రియతమా ప్రియతమా....

Marketplace